- నేను పైసలు తినను…తిననీయను…
- పేదల్ని దోచుకునే వ్యవస్థపై యుద్ధం ఆపేది లేదు.
- ఎన్ని కుట్రలు చేసినా పేదోళ్ల పక్షానే నిలుస్తా
- పొద్దున్నే పాల బిల్లు బెల్ట్ షాపుకే…ఇది మారాలనేది నా ఆవేదన..
- రెండున్నరేళ్ల పాలనలో పేదలకు అండగా నిలిచాను
- పార్టీలకు అతీతంగా పేదోళ్ల జీవితాల కోసం పోరాటం చేయాలని పిలుపు
- అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం తప్పదు
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్
చేర్యాల:
చేర్యాల మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పీఎంఆర్ గార్డెన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియో జకవర్గంలో నడుస్తున్న అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణపై మరోసారి జన గామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్(MLA PALLA RAJESWER REDDY FIRE ) అయ్యారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తూ పేద ల జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు, మహిళా సంఘాలు పార్టీలకు అతీ తంగా కలిసి ముందుకు వచ్చి ఈ బెల్ట్ షాపులను మూసివే యాలని పిలుపునిచ్చారు. పేదలను దోచుకునే ఈ వ్యవస్థ ను తప్పకుండా అరికట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాను తాగనని, తిననని, పైసలు తిన నని..తిననీయనని తేల్చిచెప్పారు. గత రెండున్నరేళ్లుగా తన పాలనను ప్రజలు చూస్తున్నారని, ఈ కాలంలో పేదలకు అండగా నిలిచానని గుర్తు చేశారు. పొద్దున్నే లేవగానే పాల బిల్లంతా బెల్ట్ షాపులకే వెళ్లే దుస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. అధికార దారు లకు మద్యం అమ్మడం, కల్తీ చేయడం, ప్రైవేట్ సైందాలను నడపడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇది వద్దు..వేరే వ్యాపారం చేయండి అని ప్రజాప్రతినిధులు స్పష్టంగా చెప్పాలని సూచించారు.

















