- హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు…నిజం ముందు కుట్రలు కూలిపోయాయి..
- కాళేశ్వరం ఒక సమగ్ర ప్రాజెక్ట్…ఒక్క మెడిగడ్డ కాదు..
- 16 సంస్థల అనుమతులతో నిర్మాణం జరిగింది
- ఆర్థిక సంస్థల పరిశీలన తర్వాతే రుణాలు మంజూరు
- కేసీఆర్, హరీష్ రావుపై ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమే
- మెడిగడ్డ ఘటనతో మొత్తం ప్రాజెక్ట్‌ను దూషించడం తగదు
- రెండున్నరేళ్లుగా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వంపై మండిపాటు
- రైతుల ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి
- కుంగిన స్తంభాలకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANGAON MLA )బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. మొదటి నుంచి తాము చెబుతున్నట్లుగానే, ఈ తీర్పు తో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందని ఈ తీర్పు నిరూపించిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక మెడిగడ్డ లేదా ఒకే నిర్మాణం కాదని, అనేక బ్యారేజీలు, వేల కిలోమీటర్ల పొడ వైన కాలువలు, టన్నెల్స్, రిజర్వాయర్లు కలిపిన సమగ్ర ప్రాజెక్ట్ అని ఆయన వివరించారు. ఆలేరు నుంచి భువనగి రి, కొండపోచమ్మ, మల్లన్నసాగర్, అన్నపూర్ణసాగర్, రంగ నాయక్ సాగర్, అప్పర్ మానేరు, లోయర్ మానేరు వంటి అనేక భాగాలను కలిపే మహత్తర యజ్ఞమే కాళేశ్వరం అని పేర్కొన్నా రు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కోణంలో కమిషన్ ఏర్పాటు చేసి వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేసిందన్నారు. కాళే శ్వరం నిర్మాణానికి కేంద్ర జలవనరుల సంఘంతో సహా దాదాపు 16సంస్థలు అనుమతులు ఇచ్చాయని చెప్పారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇది ప్రభుత్వ సమిష్టి నిర్ణయంగా అమలైందన్నారు. అదేవిధంగా ఆర్ఈ సీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థలతో పాటు బ్యాం కులు కూడా అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతే రుణా లు మంజూరు చేశాయని తెలిపారు.
అప్పటి సీఎం కే.చంద్రశేఖర్ రావు, మంత్రి టి. హరీష్ రావుపై ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన స్పష్టం చేశారు. మెడిగడ్డ వద్ద రెండు స్తంభాలు కుంగిన ఘట నను చూపిస్తూ మొత్తం ప్రాజెక్ట్‌ను దూషించడం తగదన్నా రు. ఆ సమస్యను వెంటనే మరమ్మతు చేయాల్సింది పోయి, రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం చేయడం దురుద్దేశ పూరితమని విమర్శించారు.
హైకోర్టు తీర్పు ద్వారా బీఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్పిన విషయా లే నిజమని తేటతెల్లమైందని తెలిపారు. అసంపూర్తి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడం ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తీర్పు ఒక చెంపపెట్టుగా భావించవచ్చన్నారు.
ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు, దుష్ప్రచారాలు మాను కుని రైతుల ప్రయోజనాల కోసం పని చేయాలని సూచిం చారు. కుంగిన స్తంభాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి, ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, రైతుల సంక్షేమాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

















