12.5 C
London
Saturday, June 13, 2026
Home భక్తి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి 

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి 

0
  • పెంబర్తి గ్రామంలో ఘనంగా దుర్గమ్మ ముగింపు ఉత్సవాలు
  • ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ:

జనగామ మండలం పెంబర్తి గ్రామంలో ఘనంగా నిర్వహి  స్తున్న దుర్గమ్మ ముగింపు ఉత్సవాల్లో ఆదివారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ Palla Rajeshwar Reddy ముఖ్య అతిథి గా హాజరైయ్యారు. డప్పుల మోతలు, మంగళ వాయిద్యాల మధ్య గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ..గ్రామ ప్రజల సుఖసంతోషా లు, పంటలాభాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమ్మవారి ని ప్రార్థించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మె ల్యేను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని, గ్రామంలో ఐక్యత, శాంతి నెల కొనాలని ఆకాంక్షించారు.

  • గ్రామ సర్పంచ్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే :

అనంతరం తర్వాత గ్రామ సర్పంచ్ ఆహ్వానం మేరకు వారి నివాసానికి ఎమ్మెల్యే పల్లా వెళ్లి అక్కడ స్థానిక ప్రజలతో ఆత్మీయంగా ముచ్చటించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమ స్యలు, కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై కాసేపు చర్చించారు. ఎమ్మెల్యేను కలిసి ప్రజలు తమ సమస్యలను వివరించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here