- చేర్యాల టు ఉప్పల్ రింగ్‌రోడ్‌కు నేటి నుంచే కొత్త బస్సు సర్వీస్
- ఆర్టీసీ అధికారులతో చర్చించి ప్రజల రవాణా కష్టాలకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల:
చేర్యాల ప్రాంత ప్రజలకు జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు శుభవార్త అందించారు. ప్రజల రవా ణా అవసరాలను గుర్తించి, ఆర్టీసీ అధికారులతో ప్రత్యే కంగా చర్చించి చేర్యాల నుంచి ఉప్పల్ రింగ్‌రోడ్ వరకు నూతన బస్సు సర్వీసును(New bus service from Cheryala to Uppal Ring Road)నేటి నుంచి ప్రారంభించేందుకు కృషి చేశారు.
చేర్యాల నుంచి ఉప్పల్, ఘట్కేసర్, హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు ఈ కొత్త సర్వీస్ ఎంతో ఉపశమనం కలిగించ నుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, రోజువారీ పనుల నిమిత్తం నగరానికి వెళ్లే ప్రజలకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఘట్కేసర్లోని నీలిమ హాస్పిటల్లో ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అందుతున్న ఉచిత వైద్య సేవ లను పొందేందుకు చేర్యాల, పరిసర ప్రాంతాల నుంచి వెళ్లే పేద, సామాన్య ప్రజలకు కూడా ఈ బస్సు సర్వీస్ ఎంతో ఉపయోగపడనుంది.
వైద్యం కోసం ఘట్కేసర్ వెళ్లాలంటే రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొత్త బస్సు సర్వీస్ అందుబాటులోకి రావడంతో ఆ కష్టాలు తగ్గనున్నాయి. ముఖ్యంగా పేద కుటుంబాలకు ప్రయాణ ఖర్చులు, సమ యం ఆదా కానున్నాయి.
ప్రజల అవసరాలకు అనుగుణంగా రవాణా సౌకర్యాల ను మెరుగుపరిచే దిశగా ఎమ్మెల్యే తీసుకున్న చర్యపై చేర్యాల ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

















