- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు..!
- కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు..మొత్తం తెలంగాణ భవిష్యత్తు..
- కాళేశ్వరం పేరుతో ప్రజల్లో విషం చల్లారు..
- కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తప్పుడు ప్రచారం.
- అబద్ధాలతో రాజకీయాలు నడవవు..కాంగ్రెస్ అబద్ధాలపై పల్లా ఫైర్…
- 85 వేల కోట్ల ప్రాజెక్టును లక్ష కోట్ల స్కామ్‌గా ముద్రవేయడం పచ్చి అబద్ధం.
- హైకోర్టు తీర్పుతో కె. చంద్రశేఖర్ రావు, హరీష్ రావు నిర్దోషులయ్యారు.
- పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చట్టబద్ధం కాదు..
- క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండా వందల మందిని నిందించడం రాజ్యాంగ విరుద్ధం.
- 400 కోట్ల రిపేర్‌ను 4 వేల కోట్లుగా మార్చాలనేది కాంగ్రెస్ కుట్ర.
- 30 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కదలని మేడిగడ్డ.
- మేడిగడ్డ పూర్తిగా కూలిపోయిందన్న ప్రచారం బూటకం.
- కాంగ్రెస్ కావాలనే కూల్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
- కాళేశ్వరం వల్లే తెలంగాణలో పంటలు, సంపద పెరిగాయి.
- రేవంత్ రెడ్డి మాటలకు కాంగ్రెస్ నేతలే తిప్పికొడుతున్నారు.
- కేసీఆర్ ప్రసంగం 40లక్షల మంది వింటే..రేవంత్ మాటలు 4 లక్షల మందికే పరిమితం.
- మళ్లీ మన ప్రభుత్వమే రాగానే మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోతాం.
- కేసీఆర్ జీవన్ రెడ్డి కలయిక తొలి విజయమే జగిత్యాల సభ…
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
చేర్యాల:
చేర్యాల మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పీఎంఆర్ గార్డెన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజే శ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, హైకోర్టు తీర్పుపై(high court tirpu)మాట్లాడారు.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాయింట్స్:
- జగిత్యాల సభను చూసిన తర్వాత ఉద్యమ కాలం నాటి కె. చంద్రశేఖర్ రావును ప్రజలు మళ్లీ చూశారు.
- సభకు తరలివచ్చిన జనసందోహం, వారి ఉత్సాహం, ఉరుకులు పెట్టిన స్పందన సభ విజయానికి నిదర్శనం.
- లక్షలాది మంది తరలివచ్చి సభను ఘనవిజయం చేశారు.
- సభ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ గారు, జీవన్ అన్న జగిత్యాల సభ ఏర్పా ట్లలో జనగామ టీమ్ అద్భుతంగా పనిచేసిందని అభినందించారు.
- కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు వచ్చింది.
- కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు. కాళే శ్వరం మీద లక్ష కోట్లు పెట్టలేదు. కాళేశ్వరం అంటే అనేక రిజర్వాయర్లు, అనేక పంప్ హౌసులు, వేల కిలోమీటర్ల కాలువలు, పెద్ద పెద్ద పంపింగ్ స్టేషన్లు, వాటిని నడిపేందుకు నిర్మించిన సబ్‌స్టేషన్లు, వందల కిలోమీటర్ల పొడవైన టన్నెల్లు ఇవన్నీ కలిసిన ఒక సమహారం కాళేశ్వరం..
- మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్, దాని పైభా గంలో ఉన్న పార్వతి, సరస్వతి రిజర్వాయర్లు, అన్నా రం, సుందుర్ల రిజర్వాయర్ల నుంచి నీటిని ఎత్తిపోస్తే ఎల్లం పల్లి నుంచి మిడ్ మానేరు చేరుతుంది.
- అక్కడి నుంచి మరోవైపు అన్నపూర్ణ సాగర్, రంగనా యక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, ఆలేరు వరకు నీళ్లు చేరుతాయి.
- అదే విధంగా కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్, హన్మ కొండ, భూపాలపల్లి, వరంగల్, మహబూబా బాద్, ఖమ్మం ప్రాంతాలకు నీళ్లు అందుతున్నాయి. ఇవన్నీ కలిసే కాళేశ్వరం. అందుకే దానికి ఆ పేరు పెట్టాం.
- కాళేశ్వరం ప్రాజెక్టుపై మొత్తం ఖర్చు సుమారు 85 వేల కోట్లు మాత్రమే. మేడిగడ్డకు సంబంధించిన పని విలువ కేవలం 4వేల కోట్లు…
- అందులో మెదక్, సిద్దిపేట జిల్లాలకు బ్రాహ్మణమైనా నీళ్లు పోతాయ్.
- రెండు పిల్లర్లు కుంగిన ఘటనకు అయ్యే మరమ్మతు ల ఖర్చు సుమారు 400 కోట్లు మాత్రమే.
- ప్రాజెక్టుకు ఎల్ అండ్ టి వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థ గ్యారంటీ ఉంది. అందుకే మరమ్మతుల బాధ్య త వారిదే.
- కాళేశ్వరం ప్రాజెక్టులో 95 శాతం మీటర్లు పూర్తి కాగా, సుమారు 600 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తున్నాం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.
- మల్లన్న సాగర్ నీళ్లు కూడా కాళేశ్వరం నుంచే రేవంత్ రెడ్డి 8వెల కోట్లు పెట్టేసి గోదావరి నీళ్లను ముసిలోకి తీసుకొస్తాం అంటున్నారు.
- ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? మల్లన్న సాగర్ నుంచే. మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఈ వేసవిలో కూడా అక్కడ 29 టీఎంసీల నీరు ఉంది.
- ఎల్లంపల్లి నుంచి వచ్చే నీరు కూడా మనమే నిర్మించిన పంపులు, టన్నెల్లు, సబ్‌స్టేషన్ల ద్వారానే వస్తోంది.
- ఆ టన్నెల్స్ కావాల్సినా పెద్ద పెద్ద సబ్ స్టేషన్ లు కూడ మనం కట్టిచ్చినవే.
- అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పూర్తిగా దురుద్దేశపూరితమైనది.
- కాళేశ్వరం లో 85 వెల కోట్లు ఖర్చు అయ్యాని కేంద్ర ప్రభుత్వం చెప్తే లక్ష కోట్లు వృధా అయ్యాయని చెప్తు న్నారు. ఎలా వృధా అయ్యాయి లక్ష కోట్లు మునిగి పోయాయి అని చెప్తున్నారు. పచ్చి అబద్దం..
- పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చట్టబద్ధం కాదు..పీసీ ఘోష్ కమిషన్ ఒకపక్షపాతంగా వ్యవహరించింది.
- కెసిఆర్, హరీష్ రావు సహా వందల మందిని నిందితులుగా పేర్కొంది.
- కానీ ఎవరికీ క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం ఇవ్వలేదు. ఇది ఆర్టికల్ 8, 24లకు విరుద్ధం.
- అందుకే ఈ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టడం చట్టబద్ధం కాదు అని హైకోర్టు స్పష్టం చేసింది.
- ప్రభుత్వం కమిషన్ వేయడానికి హక్కు ఉంది.
- కమిషన్ అన్ని ఎందుకు పనికి రాదు..గోదావరిలో కలపమని చెప్పేసి చెప్పిండ్రు..
- ఏది ఒక్క చెత్త బుట్టలో వేయొచ్చా అని చెప్పిండ్రు.
- రెండైన్నర ఏళ్ల నుంచి చాలు ఇబ్బంది పెడ్తన్నా రు.రేవంత్ రెడ్డి మెడిగడ్డ పనికిరాడు అని చెప్పిండు. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి మెడిగడ్డ కు పోయిండు ఎందుకు పోయిండు.
- అంతకముందు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ని తీసు కవచ్చి ఇది కూలిపోయింది అని చెప్పిండు కదా..
- ఆ కూలిపోయిన దానిమీద కదా ఇవాళ మొత్తం కన్వాయ్ పోయింది..కూలిపోతే కన్వాయ్ ఎట్లా పోతుంది..
- మేడిగడ్డ పూర్తిగా కూలిపోయిందని చెప్పడం అబద్ధం.
- 30 లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్లినా నిర్మాణం కదలలేదు.
- ఇది చిన్న రిపేర్ మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కూల్చేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
- కాంగ్రెస్, బీజేపీ పార్టీ లు చెప్పింది బుటకపు నాటకాలు, అవస్తవాలు..
- కాళేశ్వరం వల్లే పంటలు పెరిగాయి.ప్రతి చెరువుకు నీళ్లు వస్తున్నాయి. తెలంగాణకు సంపద వచ్చింది.
- ప్రజల్లో విషం లాగా అబద్ధాలు ప్రచారం చేశారు.
- హైకోర్టు తీర్పుతో కెసిఆర్, హరీష్ రావు నిర్దోషులుగా బయటపడ్డారు.
- జగిత్యాల సభ నుంచే మంచి రోజులు ప్రారంభమయ్యాయి.
- ఎంత కుచ్చిత బుద్ధితో ముఖ్యమంత్రి వ్యవహరించారో ప్రజలే చూశారు.
- అదే సమయంలో మేడిగడ్డ దగ్గరికి వెళ్లి మీటింగ్ పెట్టా రు. కె. చంద్రశేఖర్ రావు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు. కానీ అప్పటికే ప్రజలందరూ వెళ్లిపోయారు.
- కెసిఆర్ ప్రసంగాన్ని 40 లక్షల మంది చూస్తే, రేవంత్ రెడ్డి మీటింగ్‌ను కేవలం 4 లక్షల మంది మాత్రమే విన్నారు.
- మేడిగడ్డపై చెప్పిన అబద్ధాలు, గొదావరిలో కలిసిన ట్టయి, ఆ మాటలు చివరకు నీతి మూటలుగా మారిపోయాయి.
- అందుకే కాళేశ్వరం అనేది ప్రాణేశ్వరం. ఇప్పటి నుంచి కాళేశ్వరం గురించి ఎవరు మాట్లాడినా సమాధానం చెప్పాలి.
- రెండు ఏళ్లలో కూడా రేవంత్ రెడ్డి ఏమీ చేయలేరు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే పనులు చేస్తాం.
- అదే మేడిగడ్డ నుంచి అన్నారం, సుందుర్లకు నీటిని ఎత్తిపోస్తాం.
- 400 కోట్లతో పూర్తయ్యే పనిని 4 వేల కోట్లకు దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు.కెసిఆర్ జీవన్ రెడ్డి కలయిక మొదటి విజయమే జగిత్యాల సభ.
- రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లేలా, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరై రెంకలు వేస్తోంది.
- కాంగ్రెస్ నాయకులే రేవంత్ రెడ్డి మాటలను తిప్పికొడుతున్నారు.
- ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును కొత్తగా కట్టాలంటే మూడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి.
- కానీ మేము కేవలం 85 వేల కోట్ల రూపాయలతోనే, భూసేకరణతో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించాము.
- కాళేశ్వరం అనేది వాస్తవం. వారు వేసినవి అబద్ధాలు.

















