15.2 C
London
Monday, June 1, 2026
Home టాప్​ బ్రేకింగ్స్​ ఆర్టీసీ కార్మికుల రక్తంతో రాజకీయాలు చేస్తారా..?

ఆర్టీసీ కార్మికుల రక్తంతో రాజకీయాలు చేస్తారా..?

0
  • మాటలు బీజేపీవి…ప్రాణం తీసింది మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే!
  • బండి సంజయ్‌కు ఎస్కార్ట్…బీఆర్‌ఎస్ నేతలకు అరెస్టులా?
  • కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం ఎట్టాకేలకు బయటపడింది..
  • మమ్మల్ని అరెస్టు చేస్తే ఉద్యమం ఆగదు
  • ప్లజల సమస్యలపై మాట్లాడే హక్కునే నొక్కేస్తున్నారు.
  • ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సిందే!
  • సమ్మెను అణచివేయలేరు…కార్మికుల హక్కుల పోరాటం ఆగదు.
  • 2021–25 పీఆర్సీ వెంటనే ప్రకటించాలి
  • శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
  • ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన కుటుంబానికి అండగా నిలవాలి
  • కార్మికుల పక్షానే నిలుస్తాం…ఎన్ని అరెస్టులైనా భయపడం.

                       రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎమ్మెల్యే డా. పల్లా  ఫైర్ 

జనగామ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రెచ్చగొట్టే విధానాల వల్ల నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా, శంకర్ గౌడ్ పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించేం దుకు వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, మాలోత్ కవితలను పోలీసులు అరెస్టు చేసి జనగామ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ అరెస్టులకు నిరసనగా వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeswer reddy) ఆధ్వర్యం  లో బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు…ఇది ప్రభుత్వ హత్య..జోహార్ శంకర్ గౌడ్..పోలీస్ జులుం నశించాలి..కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి నశిం చాలి అంటూ పల్లా నినాదాలు చేశారు. అదే విధంగా ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న నాయ కులపై పోలీస్ అణచివేతను తక్షణమే నిలిపివేయా  లి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చి వారి అపాయింట్‌మెంట్ తేదీలను వెంటనే ప్రకటిం చాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనం తరం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా తో ఘాటుగా మాట్లాడారు.

ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాయింట్స్:

  • కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏకపక్షంగా, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నదని తీవ్రంగా విమర్శించారు.
  • ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కుటుంబాన్ని ఓదార్చేందుకు వరంగల్ జిల్లా, హైదరాబాద్ నాయ కత్వం, పార్టీ ముఖ్య నాయకులు సబితా ఇంద్రారెడ్డి, బోయినిపల్లి వినోద్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, మధుసూ దన్ చారి, మాజీ ఎంపీ కవిత కలిసి వెళ్తుంటే దుర్మా ర్గంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
  • రాజకీయ నాయకులు అక్కడికి పోవద్దని, ఎవరినీ అక్కడికి పోనివ్వవద్దని ఆదేశాలు జారీ చేశారని ఆరోపిం చారు.
  • పెద్దీ సుదర్శన్ రెడ్డిని అరెస్టు చేసి ఖమ్మం తీసుకెళ్లా రని, అలాగే ఆయన భార్య పెద్ద స్వప్నను కూడా అరెస్టు చేశారు.
  • బీఆర్‌ఎస్ యువజన నాయకులను కూడా అరెస్టు చేశారని చెప్పారు.
  • మొత్తం వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను అరెస్టు చేసి రాష్ట్ర, జిల్లా నాయకత్వం మొత్తాన్ని నిర్బంధించా రని విమర్శించారు.
  • రెచ్చగొట్టే మాటలు, అహంకారపూరిత వ్యాఖ్యల వల్లే ఈ రోజు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
  • కొత్తగూడెం, భూపాలపల్లి, నల్గొండ ప్రాంతాల్లో జరిగిన ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వమే కారణమని ఆరోపిం చారు.
  • ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాటలు, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలే ఇందుకు కారణమే..
  • ఈ రోజు ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ రూ అండగా లేరని విమర్శించారు.
  • బీజేపీ నేతలను రప్పించుకుని బండి సంజయ్ తో చీకటి ఒప్పందం ఉందని ఈ రోజు స్పష్టమైందన్నారు.
  • బీజేపీ సమ్మె గురించి మాట్లాడదని, కానీ అన్ని విష యాలు మీతో మాట్లాడుకుంటారని వ్యాఖ్యానించారు.
  • ఈ రోజు బండి సంజయ్‌ను ఎలా తీసుకెళ్లారో,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎందుకు పోనివ్వలేదని ప్రశ్నించారు.
  • ఎల్‌ఓపీగా ఉన్న మధుసూదన్ చారి ఆ జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయనను ఎందుకు పోనివ్వలేదని నిలదీశారు
  • బీజేపీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయ కత్వానికి మధ్య ఉన్న బంధం ఏంటో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
  • వాళ్లను పోనిచ్చి, మమ్మల్ని పోనివ్వకుండా అరెస్టు చేయడం ఏ న్యాయమని ప్రశ్నించారు.
  • ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు కూడా లేకుండా అందరినీ బందిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • ఉదయం లేచినప్పటి నుంచి బీజేపీ నాయకులను ప్రభుత్వం మోస్తోందని విమర్శించారు.
  • కరీంనగర్ నుంచి 100 మంది నాయకులతో బండి సంజయ్ వస్తే సీపీ, డీసీపీ ఎస్కార్ట్ చేస్తారని, అదే ప్రశాం తంగా మేము వెళ్లి మాట్లాడుదామంటే మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలను అరెస్టు చేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు.
  • రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం..ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. అందరికీ సమాన న్యాయం ఉండాలని డిమాండ్ చేశారు.
  • మమ్మల్ని అరెస్టు చేసి ఒక్క రోజు సంతోషపడొచ్చని, కానీ ఇది తాత్కాలికమేనని హెచ్చరించారు.
  • చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.
  • రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుట్ర వల్లే ఈ సమ్మె కొనసాగుతోందని ఆరోపించారు.
  • బీజేపీతో కుమ్మక్కై పనులను కాంట్రాక్టులకు అప్పగి స్తున్నారని విమర్శించారు.
  • ఆనంతరం ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన డిమాం డ్లను వెంటనే పూర్తి చేయాలి.
  • శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. యూనియన్‌ను పునఃస్థాపించాలి.
  • మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
  • 2021–25కి సంబంధించిన పీఆర్సీ వెంటనే ప్రకటించాలి.
  • మహాలక్ష్మి పథకం కింద రూ.3 వేల కోట్లు విడుదల చేయాలి.
  • మాట్లాడేది మాత్రం బీజేపీ..చంపింది మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే పల్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here