15.2 C
London
Monday, June 1, 2026
Home టాప్​ బ్రేకింగ్స్​ చట్టం చేతులు కట్టేసినట్లేనా?

చట్టం చేతులు కట్టేసినట్లేనా?

0
  • తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయి..!
  • రేవంత్ రెడ్డి పాలనలో హత్యలు, దాడులే ప్రగతిగా మారాయి
  • కరీంనగర్‌లో బీజేపీ గూండాగిరీకి బలి అవుతున్న ప్రజాస్వామ్యం 
  • మతం పేరుతో రాజకీయ లబ్ధి కోసం గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి చేశారు.
  • కౌశిక్ రెడ్డిపై పెట్రోల్‌, బాంబులతో వచ్చి చంపే ప్రయత్నం చేశారు.
  • ప్రజాప్రతినిధులకే భద్రత లేని దుస్థితి నెలకొంది 
  • బండి సంజయ్ రెచ్చగొట్టడమే హింసాత్మక దాడులకు మూలం 
  • కరీంనగర్ జిల్లాలో పోలీసుల పూర్తిస్థాయి వైఫల్యం
  • జ్యువెలరీ షాప్ దొంగతనంలో ఒక్కరినీ పట్టుకోలేని పోలీసులు
  • అడ్వకేట్‌పై ఆయుధాలతో దాడి…కేసే నమోదు కాలేదు
  • కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి
  • మతం పేరుతో రెచ్చగొట్టడం తప్ప బండి సంజయ్ వల్ల ప్రజలకు లాభం లేదు
  • కౌశిక్ రెడ్డికి వెంటనే భద్రత పెంచాలి..ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
  • దాడి చేసిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే అరెస్ట్ చేయాలి.
  • క్రిశాంక్‌పై అక్రమ కేసులతో ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయ త్నం చేస్తున్నారు.
  • దాడులకు ప్రతిదాడి చేసే సత్తా ఉన్నా సహనంతో బీఆర్‌ఎస్ ఉంది.
  • తెలంగాణ సాధించిన కేసీఆర్ మార్గదర్శకాల్లోనే మా పోరాటం సాగుతుంది..వెనకడుగు వేసేది లేదు..
  • కరీంనగర్ ఘటనపై డీజీపీకి బీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్:

కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్‌ ఆఫీ స్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించిన ఘటనతో పాటు, హుజురా బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్ప డిన ఘటనలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ కు(DGP OFFICE ) ఫిర్యాదు చేసింది.ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాయింట్స్:

  • తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారి పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
  • ఒకప్పుడు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లలో ఉన్నట్టే పరిస్థితులు, గత రెండున్నరేళ్లలో తెలంగాణలోనూ కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
  • రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి అంటే హత్యలు, దాడులు, మానభంగాలు, తనకు నచ్చని రాజకీయ నాయకుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు, కేసులే కనిపిస్తున్నాయని విమర్శించారు. 
  • నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదికలను పరిశీలిస్తే గత పాలనతో పోలిస్తే ఈ రెండున్నరేళ్లలో కేసులు, హత్యలు, దాడులు, దోపిడీలు అన్నింటిలోనూ పెరుగుదల స్పష్టం గా కనిపిస్తోందన్నారు.
  • కరీంనగర్ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో గత వారం రోజులు గా శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో డీజీపీకి సమ గ్రంగా వివరించామని తెలిపారు. 
  • ఒకవైపు పోలీసుల చేతగానితనం, మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అణగారి నకంగా ప్రవర్తించడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది.
  • బండి సంజయ్‌ రెచ్చగొట్టడం వల్లే ఆయన కార్యక ర్తలు గంగుల కమలాకర్ కార్యాలయం, పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయాలపై దాడులు చేశారని ఆరోపించారు. 
  • కౌశిక్ రెడ్డిని చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్‌, బాంబు లు, మ్యాచ్‌బాక్స్‌లతో వచ్చి ప్రయత్నం చేశారు..
  • సీపీ ఆఫీస్‌, బండి సంజయ్ ఇంటికి సమీపంలోని జ్యువెలర్ షాప్‌లో పట్టపగలు దొంగతనం జరిగినా ఇప్ప టివరకు ఒక్కరినీ పట్టుకోలేదని విమర్శించారు.
  • అలుగునూర్‌లో అడ్వకేట్‌పై ఆయుధాలతో దాడి జరిగినా కేసు నమోదు చేయలేదు. చివరకు బాధి తుడు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
  • కరీంనగర్ జిల్లాలో అసలు ఏమి జరుగుతోందని ఈ సందర్బంగా పల్లా ప్రశ్నించారు.
  • పోలీసులు ఎందుకు అరెస్టులు చేయడం లేదని నిల దీశారు. 
  • బండి సంజయ్‌ కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశా రని, ఆ భాషను తాను పునరుక్తి చేయదలుచుకోలేదు.
  • బండి సంజయ్ మాటలు వెనక్కి తీసుకుంటేనే తమ మాటలు వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.
  • మతం పేరుతో రెచ్చగొట్టడం తప్ప బండి సంజయ్ వల్ల ప్రజలకు లాభం లేదని, మంత్రి హోదాతో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు.
  • తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వెంటనే భద్రత పెంచా లని, బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలని, తమ కార్యాలయాలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
  • అలాగే క్రిశాంక్‌పై అనవసర కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. 
  • పోలీస్‌, కాంగ్రెస్‌, బీజేపీ కలిసి కుమ్మక్కవుతున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 
  • బండి సంజయ్‌ను ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడించారని గుర్తుచేశారు. ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రజలు గెలిపించరని పల్లా హెచ్చరించారు.
  • తమపై అన్యాయ కేసులు పెడితే చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు.
  • దాడులకు ప్రతిదాడులు చేసే సత్తా ఉన్నా, తెలంగాణ సాధించిన కేసీఆర్ ఆదేశాలు, మార్గదర్శకాల్లోనే తాము నడుస్తున్నామని స్పష్టం చేశారు.
  • ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే తప్పకుండా చర్య లు తీసుకోవాలి. అనంతరం తమ నాయకులందరికీ భద్రత కల్పించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here