- మాతృమూర్తుల గొప్పతనాన్ని చాటి చెప్పిన ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
- అమ్మే జీవితానికి తొలి గురువు…మాతృదినోత్సవం సందర్భంగా భావోద్వేగంగా స్పందించిన పల్లా
- మాతృదేవోభవ…తల్లిదండ్రులను గౌరవించే సంస్కృతి మరింత బలపడాలని ఎమ్మెల్యే పల్లా పిలుపు
- మాతృదినోత్సవం సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా ప్రత్యేక సందేశం
జనగామ:
“మనిషి జీవితంలో దేవుడిని చూసే ముందు అమ్మ ముఖా న్ని చూస్తాడు. ఈ ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉంటే అది తల్లి ప్రేమ మాత్రమే. తొమ్మిది నెలలు గర్భంలో మోసి, జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకునేది అమ్మే. పిల్లల ఆనందం కోసం తన బాధలను దాచుకుని, వారి భవిష్యత్తు కోసం తన కలలను కూడా త్యాగం చేసే మహోన్నత వ్యక్తిత్వం మాతృమూర్తి..
ఈరోజు ప్రపంచం మొత్తం మాతృదినోత్సవాన్ని జరుపు కుంటోంది. కానీ నిజానికి అమ్మను గౌరవించడానికి ఒక్క రోజు సరిపోదు. ఎందుకంటే మన జీవితంలోని ప్రతి రోజూ, ప్రతి క్షణం వెనుక ఒక తల్లి ప్రేమ, త్యాగం, ఆశీర్వాదం దాగి ఉంటుంది. సృష్టిలో దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలు చెప్పే మాటలో ఎంతో గొప్పతనం ఉంది.
జనగామ ఎమ్మెల్యే Palla Rajeshwar Reddy మాట్లాడుతూ…
అమ్మ అనేది ఒక పదం కాదు…అది ఓ భావోద్వేగం. మనం పడిపో యినప్పుడు లేపేది అమ్మ, ఓడిపోయినప్పుడు ధైర్యం చెప్పేది అమ్మ, గెలిచినప్పుడు మనకంటే ఎక్కువగా ఆనందపడేది కూడా అమ్మే. ప్రతి మనిషి జీవిత విజయాల వెనుక ఒక తల్లి త్యాగం తప్పకుండా ఉంటుంది. అమ్మ ప్రేమను, అమ్మ చేసిన సేవలను ఏ జన్మలోనూ తీర్చలేమని (A mother’s love cannot be fulfilled in any life) పేర్కొన్నారు.

అలాగే నేటి సమాజంలో వృద్ధాశ్రమాలు పెరుగుతున్న పరిస్థి తులు బాధాకరం. తల్లిదండ్రులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్న ప్పుడు మన కోసం నిద్రలేని రాత్రులు గడిపి న అమ్మను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేయకుండా ప్రేమ గా చూసుకోవాలి. తల్లి ఆశీర్వాదం ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఆనందం, ప్రశాంతత ఉంటాయి..అమ్మ ప్రేమను డబ్బుతో కొలవలేమని, ఆమె చేసిన సేవలను ఏ జన్మలోనూ తీర్చలేమని చెప్పారు.
అమ్మ చేతి అన్నం…అమ్మ మాటలోని మమకారం…అమ్మ చూపులోని ప్రేమ…ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ మరచి పోలేని అమూల్యమైన అనుభూతులు. భూమిపై కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ మాత్రమేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భావోద్వేగంగా తెలిపారు.
అనంతరం మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తల్లికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఆమెతో కొంత సమయం గడపాలి. ప్రేమగా మాట్లాడాలి. సమాజంలో తల్లిదండ్రులను గౌరవించే సంస్కృతి మరింత బలపడాలని ఆకాంక్షించారు. అమ్మ అనే పదం చిన్నదైనా…ఆమె ప్రేమ విశ్వం కంటే గొప్పది. జీవితంలో మనం ఎక్కడికి వెళ్లినా, ఎంత ఎత్తుకు ఎదిగినా..చివరికి మనసు వెతికేది అమ్మ ఒడినే. అదే అమ్మ గొప్పతనం…అనంతరం మాతృదినో త్సవం ఒక్కరోజు జరుపుకునే పండుగ కాదు…ప్రతి రోజూ అమ్మను గౌరవిస్తూ, ప్రేమిస్తూ జీవించడం నిజమైన మాతృ దినోత్సవమని ఎమ్మెల్యే పల్లా చెప్పారు.















