జెండా ఊపి జ్ఞానయాత్రను ప్రారంభించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ : అంబేద్కర్ చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy ) అన్నారు. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబు జగజీవన్ రావ్, అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీల ఆధ్వర్యంలో ఐఎంఐ సహ కారంతో సోమ వారం రాత్రి జనగామ జిల్లా కేంద్రంలో ఘనంగా జ్ఞానయాత్ర నిర్వహిం చారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ఈ జ్ఞాన యాత్ర సాగింది. ఈ యాత్రలో యువత, విద్యార్థులు, నాయకు లు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ ఆలోచనలు, సందేశాలను ప్రజలకు విస్తృ తంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జెండా ఊపి జ్ఞానయాత్రను ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమానత్వం, న్యాయం, స్వాభిమానంతో కూడిన సమాజ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవ లు అపారమని పేర్కొన్నారు. ప్రస్తుతం యువత అంబేద్కర్ ఆలోచనల ను ఆచరణలో పెట్టాలని, విద్యతో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలని సూచించారు. ఇలాంటి జ్ఞానయాత్రలు సమా జంలో అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

















