- పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరలోనే కోలుకుంటారు.
- పార్టీ మొత్తం మీ కుటుంబానికి అండగా ఉంటుంది.
- త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్:
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయ కుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె పోటుకు గురై సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో(At Yashoda Hospital in Secunderabad)గత మూడు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామ ర్శించారు.

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణితో పాటు వారి కుటుంబ సభ్యులను కలిసి ఎమ్మెల్యే వారికి మనోధైర్యం నింపారు. ఆయనకు అత్యుత్తమ వైద్య సేవలు అందిం చాలని వైద్యులను కోరారు. అధైర్యపడాల్సిన అవసరం లేదు…సుదర్శన్ రెడ్డి గారు ఈ క్లిష్ట పరిస్థితిని ధైర్యంగా అధిగమించి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటా రు. పార్టీ మొత్తం మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ వారిని ఓదార్చారు. అనంతరం తెలంగాణ ఉద్యమం లో విశేష పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకుని మునుపటిలాగే ప్రజాక్షేత్రంలో చురుకుగా సేవలందించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్న ట్లు తెలిపారు.

















