- బంధం అంటే ఇదే..చిన్నాన్నను భుజాలపై మోసిన రాజేశ్వర్ రెడ్డి
వేలేరు:
రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా..కుటుంబ బంధాలకు, ఆత్మీయ అనుబంధాలకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇచ్చే ప్రాధా న్యతను చాటిచెప్పే భావోద్వేగ దృశ్యం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం వేలేరు మండలం షోడాషపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజే శ్వర్‌రెడ్డి చిన్నాన్న, రిటైర్డ్ టీచర్ పల్లా జనార్దన్‌రెడ్డి(Palla Janardhan Reddy, a retired teacher and paternal uncle of Jangaon MLA Palla Rajeshwar Reddy) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన షోడాషపల్లి గ్రామానికి చేరుకుని తన చిన్నా న్న భౌతికకాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యా రు. కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులర్పించి, చిన్నా న్నతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాప కాలను గుర్తుచేసుకున్నారు. కుటుంబానికి పెద్దదిక్కు గా, విద్యాబోధనలో ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచిన రిటైర్డ్ టీచర్ జనార్దన్‌రెడ్డి సేవలను స్మరించుకుంటూ భావో ద్వేగానికి లోనయ్యారు.
చిన్నాన్నను భుజాలపై మోస్తూ…కన్నీటి వీడ్కోలు:
తన చిన్నాన్నపై ఉన్న ఆత్మీయతను పల్లా జనార్దన్‌రెడ్డి మృత దేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రజా జీవితంలో నిత్యం ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి..ఆ క్షణంలో రాజకీయ నాయకుడిగా కాకుండా తనకు ఎంతో ఆప్తుడైన చిన్నాన్నను కోల్పోయిన ఓ కుటుంబ సభ్యు డిగా కనిపించారు..
కుటుంబానికి అండగా ఉంటానని భరోసా:
అనంతరం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వ ర్‌రెడ్డి పరామర్శించి ఓదార్చారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి ఎల్లప్పుడూ తాను అండగా ఉంటాను.. ఎలాంటి ఆపద వచ్చినా తాను ఉన్నాననే భరోసాతో ధైర్యంగా ఉండాలని వారికి తెలిపారు.

















