18 C
London
Monday, August 31, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ జనగామ గడ్డ..ఉద్యమాల పురిటిగడ్డ..!

జనగామ గడ్డ..ఉద్యమాల పురిటిగడ్డ..!

0
  • అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువొద్దు
  • ప్రశ్నించే తత్వమే ఈ ప్రాంత ప్రజల ప్రత్యేకత
  • దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల త్యాగాల గడ్డ జనగామ
  • తెలంగాణ సాధనలో కేసీఆర్‌ పోరాటం చరిత్రాత్మకం
  • కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి పరుగులు
  • సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కేసీఆర్‌ ప్రభుత్వం ముందడుగు
  • నిర్మించిన ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం
  • కాంగ్రెస్‌ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదు
  • ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది బీఆర్‌ఎస్‌
  • బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కష్టసుఖాల్లో అండగా ఉంటుంది
  • రాబోయే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారు
  • స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జనగామ చరిత్ర, తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి 

జనగామ:

జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను(80th Indepe ndence Day celebrations at the BRS party office) శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి (Jangaon MLA Palla Rajeshwar Reddy)హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ స్వాతంత్ర్యం, తెలంగాణ సాయుధ పోరాటం, మలిదశ తెలంగాణ ఉద్యమం, జన గామ ప్రాంత చరిత్ర, కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి తదితర అంశాలను ప్రస్తావించారు.

జనగామ ఎమ్మెల్యే పల్లా మీడియా పాయింట్స్:

  • 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతానికి అదే సమయంలో స్వాతంత్ర్యం రాలేదు.
  • అప్పట్లో తెలంగాణ నిజాం పరిపాలనలో ఉండేది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం చేశారు. ఈ పోరాటంలో సుమారు 4 వేల మంది అమరులయ్యారని పేర్కొ న్నారు.
  • ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని, ఎదిరించే ధైర్యాన్ని నింపిన పోరాట యోధుల్లో దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి మహనీయులు ఉన్నారని గుర్తుచేశారు.
  • తెలంగాణ సాయుధ పోరాటానికి జనగామ ప్రాంతం కీలక కేంద్రంగా నిలిచింది. అనేక మంది అమరులు, ఉద్యమకా రులు, త్యాగధనులకు జన్మనిచ్చిన గడ్డ జనగామ అని పేర్కొన్నారు.
  • తెలంగాణ సాయుధ పోరాటం, తదనంతర ఉద్యమాలు, మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు జనగామ ప్రాంతం నిరంతరం చైతన్యవంతంగా కొనసాగింది.
  • ప్రశ్నించే తత్వం, ఎదిరించే ధైర్యం ఈ ప్రాంత ప్రజల ప్రత్యే కత అని అన్నారు.
  • 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన అనంతరం జరిగిన పరిణామాలపై కూడా తెలంగాణ ప్రజలు నిరంతరం ప్రశ్నిస్తూ వచ్చారు.
  • తొలి తరం ఉద్యమకారులైన దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మల తర్వాత రెండో తరం మేధావులుగా కాళోజీ నారా యణరావు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వంటి ఉమ్మడి వరంగల్‌ జిల్లా బిడ్డలు తెలంగాణ ఉద్య మానికి బలమైన పునా దులు వేశారని చెప్పారు.
  • 2001 నుంచి కేసీఆర్‌ నాయకత్వంలో సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమం ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది.
  • వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, లక్షలాది మంది ప్రజల పోరాటం, అనేక వర్గాల భాగస్వామ్యంతో తెలంగాణ ఉద్యమం ముందుకు సాగింది.
  • హింసకు తావులేకుండా గాంధేయ మార్గంలో సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
  • తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం తొమ్మిదిన్నరేళ్ల పాటు కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుకు సాగింది.
  • ముఖ్యంగా సాగునీటి రంగంలో అనేక ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, ఎత్తిపోతల పథకాలు నిర్మించడంతో జనగామ ప్రాంతానికి కూడా సాగునీరు అందుబాటులోకి వచ్చింది.
  • కేసీఆర్‌ హయాంలో సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్‌ చేసి సమ్మక్క సాగర్‌ వంటి ప్రాజెక్టులను నిర్మించడంతో పాటు రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు కాలువల నిర్మాణం, భారీ మోటార్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. గండిరామవరం, లక్నూర్‌, తాపాస్‌పల్లి, చీటకోడూరు, బచ్చన్నపేట తదితర ప్రాంతాల్లోని చెరువులకు నీరు చేర డానికి అప్పటి ప్రభుత్వం చేపట్టిన సాగునీటి అభివృద్ధి పనులే కారణమని అన్నారు.
  • 2004 నుంచి 2014 వరకు పరిమిత స్థాయిలో సాగునీరు అందించగా, 2014 నుంచి 2023 వరకు కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందేలా ప్రాజెక్టులు చేపట్టామని పల్లా పేర్కొన్నారు.
  • దేవాదుల ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి సమ్మక్క సాగర్‌ నిర్మాణం, కాలువలు, రిజర్వాయర్లు, పంపింగ్‌ వ్యవస్థల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించామని తెలిపారు.
  • నష్కల్‌, నవాబ్‌పేట, అశ్వరావుపల్లి, ధర్మసాగర్‌, ఘన్‌పూర్‌ తదితర రిజర్వాయర్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేప ట్టినట్లు వివరించారు.
  • ప్రస్తుత ప్రభుత్వం గతంలో నిర్మించిన రిజర్వాయర్లు, కాలు వలు, పంపింగ్‌ వ్యవస్థలను సమర్థంగా వినియోగించి రైతులకు నీరు అందించడంలో విఫలమవుతోందని ఎమ్మెల్యే విమర్శించారు.
  • అనేక మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదు. సాగునీటి సమ స్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
  • భూసేకరణ పూర్తి చేసి కాలువల నిర్మాణం చేపడితే మరిన్ని ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. ఇందుకు అవస రమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
  • ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు అండగా నిలుస్తోంది.
  • కేసీఆర్‌ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టసుఖాల్లో ఒకరికొకరు అండగా నిలుస్తారని చెప్పారు.
  • సంపత్‌రెడ్డి, జగదీశ్వర్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి వంటి నాయ కులు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబాలకు పార్టీ నాయకత్వం అండగా నిలిచింది. ఇతరులకు సహాయం చేయడం, మనోధైర్యం కల్పించడం బీఆర్‌ఎస్‌ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగం దెబ్బతిన్నదని, గ్రామీణ ప్రాంతాల్లో యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆరోపించారు.
  • ఇళ్ల నిర్మాణాలు, అనుమతులు, ప్రభుత్వ విధానాల విష యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
  • ప్రభుత్వ ఆస్తులు, భూముల విషయంలో కూడా ప్రభుత్వం పార దర్శకంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
  • ప్రజా సమస్యలను పరిష్కరించకుండా రాజకీయ ప్రచారా  నికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును బేరీజు వేసి తగిన తీర్పు ఇస్తారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం, తెలంగాణ విముక్తి కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
  • అనంతరం జనగామ గడ్డకు ఉన్న పోరాట చరిత్రను, త్యాగాల వారసత్వాన్ని కాపాడుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here