26.8 C
London
Monday, August 10, 2026
Home తెలంగాణ నీట్ పేపర్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా...

నీట్ పేపర్ లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.

0
  • విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
  • పేపర్ లీకేజీలపై స్వతంత్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షిం చాలి.
  • నీట్, సీబీఎస్ఈ తదితర పరీక్షల లీకేజీలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
  • విద్యార్థుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగు తుంది..న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గం.
  • ఇందిరా పార్క్‌లో బీఆర్ఎస్‌వీ విద్యార్థుల సంఘీభావ నిరసనలో మీడియాతో మాట్లాడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్:

ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా బీఆర్ఎ  స్‌వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరు పై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆట లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:

  • దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్ (NEET) పేపర్ లీకేజ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.
  • గత సంవత్సరం మాత్రమే కాకుండా, ఈ సంవత్సరం కూడా నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE)తో పాటు ఇతర పోటీ పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
  • పేపర్ లీకేజీలను ప్రశ్నించిన అమాయక విద్యార్థులు, విద్యార్థి నాయ కులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే బేషరతుగా ఎత్తివేయా లని డిమాండ్ చేశారు.
  • విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, బాధ్యులందరినీ వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకో వాలని కోరారు.
  • పేపర్ లీకేజీ ఘటనపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించాలని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
  • ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తున్నారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో సంవత్సరాల పాటు కష్టపడుతున్న విద్యార్థులు, వారి కుటుంబాల ఆశలను పేపర్ లీకేజీలు ఛిన్నా భిన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
  • గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని, ప్రస్తుతం వరుసగా పరీక్షలు లీక్ కావడం వల్ల దేశ విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటోందన్నారు.
  • సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, పెల్లెట్ గన్స్ ప్రయోగించడం అత్యంత దారుణమని ఖండించారు. విద్యార్థులను ఉగ్రవాదుల్లా చూడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.
  • దేశ భవిష్యత్తైన విద్యార్థుల గొంతును అణిచివేయడం కాకుండా, వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
  • విద్యార్థుల కోసం బీఆర్ఎస్ పార్టీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని, ప్రతి విద్యార్థికి అండగా నిలు  స్తామని తెలిపారు.
  • విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here