18 C
London
Monday, August 31, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ కేజీబీవీలో ఇక సమస్యలకు చెక్..!

కేజీబీవీలో ఇక సమస్యలకు చెక్..!

0
  • విద్యార్థినుల అండగా ఎమ్మెల్యే పల్లా..
  • విద్యార్థినుల ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీ లేదు..
  • ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరా..
  • పాఠశాలలోని సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే
  • విద్యార్థినుల సమస్యలు విన్న ఎమ్మెల్యే..అక్కడికక్కడే పరిష్కారానికి హామీ
  • డ్రైనేజీ, టాయిలెట్ల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలి..
  • 15 రోజుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తా..
  • మద్దూరులో కేజీబీవీని సందర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

మద్దూరు:

మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం (Jangaon MLA Dr. Palla Rajeshwar Reddy visited the Kasturba Gandhi Balika Vidyal aya on Wednesday)సందర్శించారు.ఇటీవల ఫుడ్ పాయిజనింగ్ కారణంగా పలువురు విద్యార్థినులు అస్వస్థ  తకు గురైన నేపథ్యంలో పాఠశాలను ఆయన సందర్శించా రు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి, పాఠశాలలోని వసతులు, భోజన నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేరుగా మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. ఏయే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు? ఏ తరగతిలో ఎంతమంది విద్యార్థినులు చదువుతున్నారు? ఉపాధ్యాయుల బోధన ఎలా ఉంది? పాఠశాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నా రు.

ఫుడ్ పాయిజనింగ్ ఘటనకు గురైన విద్యార్థినులతో ఎమ్మె  ల్యే ప్రత్యేకంగా మాట్లాడారు. వారు ఎన్ని రోజులు ఆసుప త్రిలో ఉన్నారు? ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో 21 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో చేరినట్లు ఉపాధ్యాయు లు ఎమ్మెల్యేకి వివరించారు. ఘటన జరిగిన రోజునే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిం చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

పాఠశాలలోని డ్రైనేజీ సమస్యను విద్యార్థినులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను పరిష్కరించే లా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. డ్రైనేజీకి సంబంధించిన పనులను స్థానిక సర్పంచ్ సమన్వయంతో వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన జేసీబీ ఖర్చులను తానే భరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

అలాగే పాఠశాల ఆవరణలో కోతుల బెడదను విద్యార్థి  నులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కోతులు రాకుండా 15 రోజుల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

తరగతి గదులు, విద్యార్థినుల సంఖ్య, అందుబాటులో ఉన్న వసతు లపై కూడా ఎమ్మెల్యే ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏమైనా అదనపు అవసరా లు ఉంటే తన దృష్టికి తీసుకురావాలి..అవసరమైన సమ స్యలను జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

విద్యార్థినులకు అందిస్తున్న భోజనంపై కూడా ఉపాధ్యా యులను ఎమ్మె ల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్‌ను పరిశుభ్రంగా, ఇంట్లో భోజనం చేసే వాతా వరణంలా సౌకర్యవంతంగా ఉంచాలని సూచించారు. విద్యార్థినుల భోజనం, వసతి, ఆరోగ్యం విషయంలో ఎలాం టి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాల వద్దే ఉండి అవసరమైన పనులను పర్యవేక్షించాలని ఎమ్మెల్యే సూచిం చారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తా నని తెలిపారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది కలగ కుండా అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…

  • మద్దూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించడం జరిగింది.
  • వారం రోజుల క్రితం కొంతమంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజనింగ్ జరగడంతో వెంటనే స్పందించి స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఎంపీడీఓ, ఎంఈఓ, డీఈఓలతో మాట్లాడి విద్యార్థినులను చేర్యాల ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాం.
  • ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్యం స్థిరంగా ఉంది. అవసర మైతే సిద్ధిపేట లేదా హైదరాబాద్‌కు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాం. ఈ ఘటనపై వెంటనే స్పందించి విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందేలా సహక రించిన జిల్లా కలెక్టర్ కు ధన్యవాదములు తెలియజేస్తు న్నాను.
  • విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించాను. పాఠశాల ఆవరణలో డ్రైనేజీ సమస్య, పనిచేయని శౌచాలయాలు, కోతుల బెడద వంటి సమస్య లు ఉన్నట్లు గుర్తించాం. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు.
  • డ్రైనేజీ, టాయిలెట్ల మరమ్మతు పనులను ఇప్పటికే ప్రారం భించాం. కోతుల బెడదను పూర్తిగా నివారించేందుకు స్థానిక నాయకుల సహకా రంతో పాఠశాల చుట్టూ 15రోజుల్లోగా ఫెన్సింగ్ పనులను పూర్తి చేస్తాం.
  • విద్యార్థినులకు అవసరమైన స్టీల్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు, కూలింగ్ వాటర్ సదుపాయాలు తదితర పరికరాలను ప్రభుత్వ బడ్జెట్ ద్వారా లేదా అవసరమైతే సొంత ఖర్చులతోనైనా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటాం.
  • వర్షాకాలంలో విరేచనాలు, డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున పాఠశాల పరిసరాలను ఎప్పటి కప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. ముఖ్యంగా విద్యార్థినులకు అందించే ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండ కూడదని ఉపాధ్యాయులు, సిబ్బందికి స్పష్టంగా సూచించాను.
  • విద్యార్థినుల ఆరోగ్యం, భద్రత, విద్యకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం మనందరి బాధ్యత. కేజీబీవీలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here