18 C
London
Monday, August 31, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలి..!

తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలి..!

0
  • సోషల్ మీడియా రీల్స్‌తో విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు
  • భయం, బిడియం వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
  • చదువుతోనే అవకాశాలు..పైరవీలకు తావులేదు
  • ఇంటర్‌ రెండేళ్లు జీవితానికి అత్యంత కీలకం
  • గ్రామీణ విద్యార్థులు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి
  • ఇంగ్లీష్‌ ప్రపంచాన్ని తెలుసుకునే కిటికీ
  • లక్ష్యాన్ని ఎంచుకుని.. కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు
  • తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తున్న శ్రీ గాయత్రి కళాశాల అభినందనీయం

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 

జనగామ:

జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఎన్‌ గార్డెన్స్‌లో బుధవా రం ఏబీవీ ఇన్‌స్టిట్యూషన్స్‌ శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమానికి జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా (Jangaon MLA Dr. Pall a Rajeshwar Reddy attended the freshers party of Sri Gayatri Junior College ABV Instituti ons as the chief guest)హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా పాయింట్స్:

  • విద్యార్థుల్లో సబ్జెక్ట్‌పై మంచి పరిజ్ఞానం ఉన్నప్పటికీ, దానిని ఇత రులకు వ్యక్తపరిచే సమయంలో భయం, బిడియం, సిగ్గు వంటి సంకో చాలను వీడాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థు లు సబ్జెక్ట్ నాలెడ్జ్‌లో ముందున్నప్పటికీ కమ్యూనికేషన్ స్కిల్స్ లోపిం చడం వల్ల ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడుతున్నారు.
  • విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్‌ రెండు సంవత్సరాలు అత్యంత కీలకమైనవి. ఈ సమయాన్ని వృథా చేయకుండా చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు.
  • భయం, బిడియం, సిగ్గు వదిలి ఆత్మవిశ్వాసంతో మాట్లాడ టం అలవాటు చేసుకోవాలి. తెలుగులో మాట్లాడేటప్పుడు కూడా భయప డాల్సిన అవసరం లేదన్నారు.
  • ఇంగ్లీష్‌ మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లినా సిగ్గుపడ కూడదు. తప్పులు చేస్తూ నేర్చుకోవాలని, ఎవరైనా తప్పును సరిచేస్తే స్వీకరించి మరింత మెరుగుపడాలని సూచించారు.
  • రాబోయే రెండు సంవత్సరాల్లో విద్యార్థులు రెండు అంశా లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఒకటి సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు సాధించడం, రెండోది ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ను మెరుగుప రుచుకోవడం అని తెలిపారు.
  • ఇంగ్లీష్‌ ప్రపంచాన్ని తెలుసుకునేందుకు ఒక కిటికీ లాంటిది. మన నాలెడ్జ్‌ను ఇతరులకు సమర్థవంతంగా వివరించేందు కు ఇంగ్లీష్‌ మంచి మాధ్యమంగా ఉపయోగపడుతుంది.
  • ఎంపీసీ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంజనీరింగ్‌ తో పాటు అనేక ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నాయి. బైపీసీ విద్యార్థులు మెడికల్‌ ఒక్కటే లక్ష్యంగా కాకుండా ఫార్మసీ, ఫార్మా-డి, అగ్రికల్చర్‌ సైన్సెస్‌, నర్సింగ్‌ వంటి డిమాండ్‌ ఉన్న కోర్సులను కూడా పరిశీలించాలని సూచిం చారు.
  • ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్‌ చదివినా సబ్జెక్ట్‌ను క్షుణ్ణంగా, స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎంసెట్‌ వంటి ప్రవేశ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో అధ్యాపకుల సూచనలు తీసుకోవాలి.
  • ప్రాక్టికల్స్‌తో పాటు థియరీపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సబ్జెక్ట్ కాన్సెప్ట్స్‌ను అర్థం చేసుకుని చదివితే మంచి ర్యాంకులు సాధించవ చ్చని చెప్పారు.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై ఏకాగ్రత తో చదివినా వేలల్లో మంచి ర్యాంకులు సాధించి ఉన్నత విద్యలో సీట్లు పొందే అవకాశం ఉంటుంది.
  • ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌, నర్సింగ్‌ వంటి కోర్సుల్లో సీటు సాధించేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలి. అర్హత సాధించిన విద్యార్థులకు అవసరమైన సహకారం అందిం చేందుకు తాను ముందుం టానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
  • ఇతరులపై ఆధారపడకుండా ప్రతి విద్యార్థి తన సొంత ప్రతిభ, కష్టపడి చదివే తత్వంతో సీటు సాధించేందుకు ప్రయత్నించాలి. చదువే జీవితంలో నిజమైన శ్రీరామరక్ష అని అన్నారు.
  • ఉద్యోగం కోసం ప్రైవేట్‌ రంగంలోకి వెళ్లినప్పుడు మన కులం, ప్రాంతం, కుటుంబ నేపథ్యం కంటే మన నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ప్రతిభకే ప్రాధాన్యత ఉంటుంది.
  • సోషల్‌ మీడియా రీల్స్‌, అనవసరమైన వీడియోలు చూస్తూ విలువై న సమయాన్ని వృథా చేసుకోవద్దు. అవసరం ఉన్న ప్పుడు మాత్రమే ఫోన్‌ను ఉపయోగించాలని సూచించారు.
  • వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో ఉపయోగించే ‘Bro’, ‘Sis’ వంటి షార్ట్‌కట్‌ భాష జీవితంలో ఎలాంటి ఉపయోగం ఇవ్వదు. అది కేవలం ఒక స్టైల్‌ మాత్రమేనని, భాషా నైపు ణ్యాలను పెంచుకునేలా సరైన పదజాలాన్ని నేర్చుకోవాలని సూచించారు.
  • ప్రతిరోజూ ఇంగ్లీష్‌ పేపర్‌ చదవడంతో పాటు మంచి ప్రసంగా లు, విజ్ఞానాన్ని పెంచే వీడియోలు చూడాలి. తద్వారా వొకాబ్యులరీ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అభివృద్ధి చేసుకో వచ్చని చెప్పారు.
  • ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌.. ఏ రంగాన్ని ఎంచు కున్నా స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని దాని కోసం కష్టపడాలి. లక్ష్యంపై దృష్టి పెడితే మంచి ర్యాంక్‌తో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు.
  • మంచి సీటు కోసం రాజకీయ నాయకుల వద్ద పైరవీల చేయాల్సిన అవసరం లేకుండా విద్యార్థులు తమ చదువు తోనే అవకాశాలను సాధించుకోవాలి.
  • 1982-84 ప్రాంతంలో ప్రైవేట్‌ కళాశాలలు పెద్దగా లేని సమయంలో తాను చదువుకున్న రోజులను ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు. ఆ సమ యంలో ఇంజనీరింగ్‌ సీటు రాకపోయినా బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ పూర్తి చేసి, అనంతరం సొంతంగా ప్రైవేట్‌ కళాశాలను స్థాపించే స్థాయికి ఎదిగిన తన ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకున్నారు.
  • గతంలో హన్మకొండ జూనియర్‌ కళాశాలలో చదువుకున్న రోజుల్లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, తెలుగు, హిందీ వంటి ప్రతి సబ్జెక్టుకు సంబం ధించిన ఉపాధ్యాయులను పేరుపేరునా గుర్తు చేసుకునే పరిస్థితి ఉండేది.
  • కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఒకే సబ్జెక్టును వివిధ భాగాలుగా విభజించి బోధించే విధానం ఉందని, అయితే విద్యార్థులకు సబ్జెక్ట్‌పై సమగ్ర అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని అన్నారు.
  • ఏబీవీ ఇన్‌స్టిట్యూషన్స్‌ 33 సంవత్సరాలుగా విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకాన్ని సంపాదించుకుని ముందుకు సాగడం అభినందనీయమన్నారు.
  • కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో లక్షల్లో ఫీజులు చెల్లించి లక్షల్లో ర్యాంకులు సాధిస్తుంటే, తక్కువ ఫీజులతోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వేలల్లో మంచి ర్యాంకులు సాధించేలా శ్రీ గాయత్రి జూనియర్‌ కళాశాల చేస్తున్న కృషి అభినందనీయం.
  • విద్యార్థులు అందుబాటులో ఉన్న సమయాన్ని, మంచి అధ్యాప కుల మార్గదర్శకత్వాన్ని, కళాశాలలోని అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదవాలి. భవిష్యత్తులో తల్లిదండ్రు లు గర్వపడే స్థాయికి ఎదిగి, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా నిలవాలని ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here