13.6 C
London
Monday, June 1, 2026
Home పార్టీ కార్యక్రమాలు జగిత్యాల గడ్డకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది.!

జగిత్యాల గడ్డకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది.!

0
  • ఈ నేలపై నుంచే జైత్రయాత్రలకు నాంది పలికింది.
  • కేసీఆర్ మాటలు వినాలి..ఆయనను చూడాలి
    ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
  • జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్ లో చేరడం పార్టీకి బలం.
    ఆయన అనుభవం పార్టీకి ఉపయోగపడుతుంది.
  • సభను అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
  • అదే రోజు కాళేశ్వరం వద్ద మీటింగ్ పెట్టడం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు.
  • కోరుట్ల నుంచి జగిత్యాల వెళ్లే రహదారిని ఉద్దేశపూర్వకంగా తవ్విం చడం దుర్మార్గం.
  • బస్సులు రాకుండా ఆర్టీఓ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
  • ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు ఉవ్వెత్తున సభకు తరలివస్తారు.
  • జగిత్యాల సభ బీఆర్‌ఎస్ జైత్రయాత్రకు పునాది అవుతుంది.
  • వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం.
  • జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జగిత్యాల:

జగిత్యాల గడ్డకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ నేలపై నుంచే ఎన్నో జైత్ర యాత్రలకు నాంది పలికింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున ముందు కు వస్తున్నారు. కేసీఆర్ మాటలు వినాలి. ఆయనను ప్రత్య క్షంగా చూడాలని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు న్నారని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి (JANAGAMA MLA PALLA RAJESWER REDDY) అన్నారు. ఈ నెల 20న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్య టన నేపథ్యంలో జరుగనున్న భారీ బహిరంగ సభ ఏర్పా ట్లను గురువారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. జగిత్యాల సభ బీఆర్‌ఎస్ జైత్రయాత్రకు బలమైన పునాది అవుతుంద ని నమ్మకం ఉంది. ప్రజల దృష్టిని మళ్లించడానికి సీఎం రేవం త్ రెడ్డి అదే రోజు కాళేశ్వరం వద్ద మీటింగ్ ఏర్పాటు చేయ డం దురదృష్టకరమన్నారు. సభను అడ్డుకోవాలని సీఎం ప్రయ త్నాలు చేస్తున్నారు. ఆలాగే కోరుట్ల నుంచి జగిత్యాల రహదారిని ఉద్దేశపూర్వకంగా తవ్వించడం, బస్సులు రాకుండా ఆర్టీఓ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్దమన్నారు. అయినప్పటికీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు ఉవ్వెత్తున జగిత్యాల సభకు తరలివస్తారని ఆయన పేర్కొన్నారు.

జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా పాయింట్స్:

  • దశాబ్దాల క్రితమే ఇక్కడ ప్రారంభమైన ఉద్యమ స్పూర్తి దేశానికి మార్గదర్శకంగా నిలిచింది.
  • తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు, పదేళ్లలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపారు.
  • ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
  • ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలను మోసం చేశారు.
  • వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం..
  • మూడు సంవత్సరాలుగా నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
  • ఒక్క ప్రాజెక్టు పనిని కూడా ముందుకు తీసుకురాలేదు.
    ప్రజలను మోసం చేయొచ్చు కానీ ప్రజల జ్ఞాపకాలను మోసం చేయలేరు.
  • ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమలు లోపాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
  • జగిత్యాల గడ్డ ఉద్యమాల గడ్డ…చరిత్రను తిరగరాస్తుంది.
  • జీవన్ రెడ్డి గారు బీఆర్‌ఎస్ లో చేరడం పార్టీకి బలం.
    ఆయన అనుభవం, నాయకత్వం పార్టీకి ఉపయోగపడుతుంది.
  • కరీంనగర్ జిల్లా 13 నియోజకవర్గాల నుంచి భారీగా జనసందోహం వస్తుంది.
  • కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి పార్టీ గెలుపుకు కట్టుబడి ఉన్నారు.
  • జగిత్యాల సభతో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాంది పడుతుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here