13.6 C
London
Monday, June 1, 2026
Home పార్టీ కార్యక్రమాలు జగిత్యాల అంటే జైత్రయాత్రకు నాంది.!

జగిత్యాల అంటే జైత్రయాత్రకు నాంది.!

0
  • గులాబీ జెండా మళ్లీ ఎగురవేయడం ఖాయం…
  • కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడం ప్రజల సంకల్పం
  • 2029లో జగిత్యాల గడ్డపై నుంచే కేసీఆర్ జైత్రయాత్ర ప్రారంభం
  • తెలంగాణ దృష్టి అంతా ఇప్పుడు జగిత్యాల వైపే..!                   జనగామ ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

జగిత్యాల:

ఏప్రిల్ 20, 2026న జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీ ఆర్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు(BRS chief KCR to hold huge public meeting) ఏర్పాట్లు ముమ్మ రంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో ఏర్పా టు చేసిన సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. జగిత్యాల సభతో ఈ ప్రభుత్వా నికి గట్టి కనువిప్పు కలుగుతుందన్నారు. కేసీఆర్ అనుభ వం, నిబద్ధత పార్టీకి గొప్ప బలమని పేర్కొన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన జీవన్ రెడ్డి నిజాయితీకి చిరునామాగా నిలిచిన సీని యర్ నాయకుడని కొనియాడారు. నచ్చని విధానాలు, నచ్చని రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడి ప్రజల కోసం స్వచ్ఛమైన రాజకీయా న్ని ఎంచుకోవడం ఆయన ధైర్యమని అన్నా రు.

అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి రావడం సులువు కాదు:

సాధారణంగా అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి రావడం సులువు కాదు. కానీ ప్రజల కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పల్లా పేర్కొన్నారు. జగిత్యాల నాయకులు, కార్యకర్తలతో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నా నని తెలిపారు. ప్రతి సభలో వారి అంకిత భావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జీవన్ రెడ్డి సాధారణ జీవితం గడి పిన నాయకుడని, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే ఆదర్శ వ్యక్తి అని కొనియాడారు. గ్రామాలు, పట్టణాల నుంచి ప్రజ లు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. మనందరం ఒక్కటిగా నిలిస్తే బీఆర్‌ ఎస్ ప్రభుత్వం వందకు వంద శాతం తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల అంటే జైత్రయాత్రకు నాంది అని, ఇక్కడి నుంచే భవిష్యత్ రాజకీయాలకు పునాది పడుతుం దని చెప్పారు. 2029 ఎన్నికలకు జగిత్యాల గడ్డనే బలమైన కేంద్రంగా మారుస్తామని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here