- మాటల దాడితో మోత మోగించిన జనగామ ఎమ్మెల్యే..!
- మెడిగడ్డ పనికిరాదన్న నువ్వే..
- ఇవాళ అదే మెడిగడ్డ చుట్టూ తిరుగుతున్నావ్ రేవంత్ రెడ్డి..
- ఇదే నీ రాజకీయ ద్వంద్వ వైఖరి?
- కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను తిట్టి..ఇప్పుడు అదే పను లను నీ విజయంగా చూపించడం ప్రజలను మోసం చేయడమే..?
- రైతులకు ఇచ్చిన హామీలు గాలిలో కలిపి..ఇప్పుడు ప్రాజెక్టుల దగ్గర ఫోటోలు దిగడం డ్రామా కాదా?
- రేవంత్ పోవాలి..కేసీఆర్ రావాలి నినాదంతో జైత్ర యాత్రకు రావాలి
- ప్రతి ఇంటి నుంచి సైనికుల్లా రావాలని కార్యకర్తలకు పల్లా పిలుపు
జగిత్యాల :
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY )పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కేసీఆ ర్ బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా జగిత్యాల మండలం లోని లక్ష్మిపురం గ్రామంలో, సారంగాపూర్ మండల కేంద్రం లో, బీర్‌పూర్ మండలంలోని నర్సింహులపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు మెడి గడ్డ ప్రాజెక్ట్ పనికిరాదని విమర్శించిన రేవంత్ రెడ్డి..ఇప్పుడు అదే మెడిగడ్డ చుట్టూ తిరుగుతూ రాజకీయ ద్వంద్వ వైఖరి ని బయటపెడుతున్నారని మండిపడ్డారు. అలాగే మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు నిర్మించిన ప్రాజెక్టులను అప్పట్లో తిట్టి..ఇప్పుడు అదే పనులను తన విజయంగా చూపించ డం ప్రజలను మోసం చేయడమేనని తీవ్రంగా ఆక్షేపించారు. రైతులకు ఇచ్చిన హామీలను గాలిలో కలిపి, ఇప్పుడు ప్రాజె క్టుల వద్ద ఫోటోలు దిగడం కేవలం డ్రామా మాత్రమేనని విమర్శించారు.
రేవంత్ రెడ్డి హడావిడి అంతా కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం:
మెడిగడ్డ వద్ద రేవంత్ రెడ్డి చేస్తున్న హడావిడి అంతా కేసీఆర్ దూర దృష్టికి నిదర్శనమని ఎమ్మెల్యే పల్లా అన్నా రు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన వారే ఇప్పుడు అభివృద్ధి పేరుతో నటిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన పనులు స్పష్టంగా కనిపిస్తుండటంతో విమర్శ లను మింగేసి ఇప్పుడు వాటినే కొనసాగిస్తున్నారని వ్యాఖ్యా నించారు. జగిత్యాల గడ్డపై జరిగే జైత్రయాత్ర మరోసారి చరిత్రను సృష్టిస్తుందని పల్లా తెలిపారు. రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదంతో ప్రతి ఇంటి నుంచి సైనికు ల్లా కార్యకర్తలు భారీగా జైత్రయాత్రకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్‌కు జీవన్ రెడ్డి మంచి మిత్రుడు:
కేసీఆర్‌కు జీవన్ రెడ్డి మంచి మిత్రుడు..రాజకీయంగా ప్రత్యర్థులమే కానీ శత్రువులు కాదు..అందరం కలిసి పని చేస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఎమ్మెల్యే పల్లా పేర్కొన్నారు. దేశంలో రైతులకు పెట్టుబడి సహాయం అందిం చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతు బంధు వంటి పథకాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాయని తెలిపారు. మద్దతు ధర, రైతు బంధు, సాగు నీరు అంశాల్లో కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోకుండా ప్రాజె క్టుల వద్ద నాటకాలు ఆడుతోందని విమర్శించారు. గతంలో విమర్శించిన పనులే ఇప్పుడు రాజకీయ జీవనాధారంగా మార్చుకున్నారని రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2001లో తెలంగాణ ఉద్యమ సమయంలో దేవాదుల ప్రాజెక్టు పై జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ అదే విధానాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
జగిత్యాల గడ్డ పోరాటాలకు ప్రతీక:
జగిత్యాల గడ్డ పోరాటాలకు ప్రతీకగా నిలిచింది..అమరుల త్యాగాలతో చరిత్ర సృష్టించిందని పల్లా గుర్తు చేశారు. మెడి గడ్డ ప్రాజెక్టు పనికిరాదని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. జగిత్యా లలో తమ్మీదేట్ ప్రాజెక్టును ప్రారంభించకపోవడంపై ప్రశ్నిం చారు. మెడిగడ్డను పక్కనబెట్టి తమ్మీదేట్‌ను నిర్లక్ష్యం చేశా రని విమర్శించారు. మెడిగడ్డ, సుందుర్ల, అన్నారం వంటి ప్రాజెక్టు లు రాష్ట్రానికి ఉపయోగపడేలా రూపొందించబ డ్డాయని పేర్కొన్నారు.

















