- వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా
- అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా
జనగామ:
జనగామ మండలం యశ్వంతపూర్ గ్రామానికి చెందిన బీఆ ర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ వాచ్‌మెన్ మబ్బు ఎల్లయ్య గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(JANAGAMA MLA PALLA RAJESWER REDDY)శనివారం యశ్వం తపూర్ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా మబ్బు ఎల్ల య్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి వారిని ఓదార్చారు. ఎల్లయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబానికి అండగా ఉంటాన ని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

















