- కొనే శక్తి లేకే కొత్త కొత్త నిబంధనలు పెడుతుంది
- పంట ఏది వేయాలో చెప్పే ప్రభుత్వం.. కొనుగోలు మాత్రం చేయదా?
- వరంగల్ డిక్లరేషన్ హామీలన్నీ కాంగ్రెస్ గాలికొదిలేసింది
- రైతుకు బోనస్ లేదు.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
- రైతు పండించిన పంటను కొనలేక చేతులెత్తేసిన ప్రభుత్వం
- ఆంక్షలతో రైతును అణగదొక్కే కుట్ర జరుగుతోంది
- రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదు
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్:
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధాన్యం కొనుగోలు (Danyam konugolu), బోనస్ చెల్లింపులపై ఎమ్మెల్యే డా. పల్లా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిం చారు.
ధాన్యం కొనుగోళ్లపై పల్లా పాయింట్స్ :
- వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ స్వయంగా హామీ ఇచ్చి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా పొందుపరి చారని గుర్తు చేశారు.
- ఆనాడు దొడ్డు వడ్లకు క్వింటాలుకు రూ.2,183, సన్న వడ్లకు రూ.2,203 ధర ఉన్నప్పటికీ, వరితో పాటు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని విమర్శించారు.
- దొడ్డు వడ్లను పూర్తిగా పక్కనపెట్టి, కేవలం సన్న వడ్లకే బోన స్ ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే..
- సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించినా, గత రెండు సీజ న్లలో రైతులకు చెల్లించాల్సిన రూ.800 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు బోనస్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకుండా నిలిపివేసిందని ఆరోపించారు.
- ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. జనవరిలో కేవలం 8 రకాల సన్న వడ్లనే సాగు చేయాలం టూ జీవో జారీ చేసి, తర్వాత బడ్జెట్ సమావేశాల్లో 33 రకా ల సన్న వడ్లు సాగు చేసు కోవచ్చని చెప్పి ఇప్పుడు మళ్లీ 7 రకాలకే పరిమితం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ప్రభుత్వం సూచిస్తున్న 7 రకాల విత్తనాలు మార్కెట్లో అందు బాటులో లేవు. ముఖ్యంగా బీపీటీ-520 రకం చీడపీడలను తట్టుకోలేకపో తుందని, దిగుబడి కూడా తక్కువగా ఉంటుం ది.
- రైతులకు బోనస్ ఇవ్వడం ఇష్టం లేక, ధాన్యం కొనుగోలు చేసే సామర్థ్యం లేకనే ఇలాంటి ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు.
- రైతులను అమాయకులుగా భావించి ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోంది. కానీ రైతులు అన్నింటినీ గమనిస్తు న్నారని హెచ్చరించారు.
- బోనస్ పేరుతో బోగస్ చేశారు. రైతుబంధు పెంచుతామని చెప్పి ఉన్నదాన్నే తగ్గించారు. రైతు భీమా ప్రీమియంలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మళ్లీ పెరుగుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
- రైతు సమస్యలపై వ్యవసాయ కమిషన్, సంబంధిత మంత్రు లు స్పందించడం లేదని విమర్శించారు.
- వరంగల్‌లో హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్క డ ఉన్నారని ప్రశ్నించారు. రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
- వ్యవసాయ కమిషన్ బోనస్ నిలిపివేయాలి. పంటల విస్తీ ర్ణం తగ్గించాలని, యూరియా వినియోగాన్ని పరిమితం చేయాలని సిఫార్సు చేయడం దారుణమని అన్నారు.
- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. రైతు ఆత్మహత్యలను భారీగా తగ్గించగలిగామని పేర్కొన్నారు.
- ప్రత్యామ్నాయ పంటలు వేయమని చెప్పే ప్రభుత్వం, వాటిని కొను గోలు చేసే హామీ మాత్రం ఇవ్వడం లేదని విమర్శిం చారు.
- రైతులకు కావాల్సిన కరెంటు, ఎరువులు, మద్దతు ధరలు కల్పించ లేని ప్రభుత్వం, ఏ పంట వేయాలో కూడా ఆదే శించడం దారుణం..
- రైతులు తమకు అనుకూలమైన పంటలను సాగు చేసుకునే హక్కు కలిగి ఉన్నారు. ప్రభుత్వం వాటిని తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
- రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. రైతాంగ పోరాటాలకు పూర్తి మద్దతు ఇస్తుందని డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

















