- దేశానికి అన్నం పెట్టే రైతు.. పోలీసుల కాళ్లు మొక్కాలా?
- అన్నదాతలతో కాళ్ల బేరమా?
- పంట కొనమంటే లాఠీలా? చేతకాని ప్రభుత్వం దిగిపోవాలి
- రైతులను అణచివేస్తే సహించం…ప్రభుత్వాన్ని పరుగెత్తించి మరీ వడ్ల గింజ కొనిపిస్తాం!
- పోలీసుల కాళ్లపై పడ్డ రైతులు.. గుండె తరుక్కుపోతోందన్న డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి
- ప్రజా ప్రభుత్వమా? రైతులను పీడించే ప్రభుత్వమా?
- రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి
- వెంటనే ప్రభుత్వం స్పందించాలి
- వడ్లకొండ ఘటనపై మండిపడ్డ జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ:
జనగామ జిల్లా కేంద్రంలోని వడ్లకొండ(vadlakonda village) గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ పంటను కొను గోలు చేయాలని పోలీసుల కాళ్లపై పడి వేడుకుంటున్న దృశ్యాలు బాధాకరమని జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వడ్లకొండ గ్రామంలో అన్నదాతలు తమ పండించిన పంటను అమ్ముకో వడానికి ఇంత దుస్థితికి చేరుకోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫ ల్యానికి నిదర్శనమని అన్నారు. రైతులు పండించిన ధాన్యా న్ని కొనుగోలు చేయకుండా వారిని ఇబ్బందులకు గురిచే యడం దారుణమని విమర్శించారు.
పోలీసులతో అణచివేత సరికాదు:
రెక్కలముక్కలు చేసుకుని పండించిన పంటను అమ్ముకు నేందుకు రైతులు రోడ్లపైకి వస్తే వారి సమస్య పరిష్కరించా ల్సింది పోయి పోలీసులను పంపించి అణచివేయడం ఏ ప్రభుత్వ ధోరణి అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. శాంతియుతం గా నిరసన తెలుపుతున్న రైతులను అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు.
మాటిచ్చి తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం:
అధికారంలోకి వస్తే వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీలు ఇచ్చిన పాలకులు ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో సరైన చర్యలు తీసుకోకపోవ డం రైతులపై మోసం చేసినట్టేనని ఎమ్మెల్యే అన్నారు. రైతు పండించిన పంటను కొనలేని ప్రభుత్వం అధికారంలో ఉండ టానికి అర్హత లేదని సూటిగా విమర్శించారు.
అన్నదాతల కాళ్ల బేరమా?:
దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు తనే పండించిన పంటను కొనుగోలు చేయమని అధికారుల, పోలీసుల కాళ్లు మొక్కే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమని ఎమ్మెల్యే పల్లా పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా లేక రైతులను పీడించే ప్రభుత్వమా అని ప్రశ్నించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి:
ఎక్కడ చూసినా ఏ కొనుగోలు కేంద్రంలోనూ బస్తాలు అందు బాటులో లేవు. వడ్లు కొనుగోలు సక్రమంగా జరగడం లేదు. ఇప్పటికే లిఫ్ట్ చేసిన ధాన్యాన్ని కూడా ఆన్‌లోడ్ చేయకుం డా నిల్వ ఉంచుతున్నారు. ధాన్యం దించేందుకు కూలీల సమస్య తీవ్రంగా ఉంది. కేవలం వడ్లకొండ గ్రామమే కాకుం డా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పల్లా పేర్కొన్నారు.
రైతులు పండించిన పంట కొనుగోలు కాక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే అత్యవసర చర్యలు తీసుకుని వడ్లు కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నం దున ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్వయంగా మొత్తం అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించి, రాష్ట్రవ్యాప్తం గా ధాన్యం కొనుగోలు నిరాటంకంగా జరిగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రైతుల పక్షాన బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని పరుగెత్తించి మరీ రైతుల ప్రతి గింజనూ కొనుగోలు చేయిస్తామని స్పష్టం చేశారు.

















