- సమస్యలు తెలుసుకుని వెంటనే ఆదేశాలు
- ప్రజల కోరిక మేరకు ఓపెన్ జిమ్ ఏర్పాటుకు కృషి
- బతుకమ్మ కుంట అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ
- ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
మార్నింగ్ వాకింగ్ లో ఎమ్మెల్యే పల్లా
జనగామ :
జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం ఉదయం జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంట(Batuk amma Kunta)ప్రాంగణాన్ని సందర్శించారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు, యువత మార్నింగ్ వాక్ కోసం వచ్చే ఈ ప్రాంతంలో వసతులు, పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
వాకర్స్‌తో కలిసి నడుస్తూ సమస్యలపై చర్చ:

మార్నింగ్ వాక్ చేస్తున్న స్థానికులతో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశమై, వారితో కలిసి నడుస్తూ బతుకమ్మ కుంట పరిసర ప్రాంతాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. వాకర్స్ తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వాటిని శ్రద్ధగా విన్నారు.
ఓపెన్ జిమ్ కోసం విజ్ఞప్తి:
ప్రాంగణానికి వచ్చే యువత, మహిళలు, వృద్ధుల ఆరో గ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ కుంట వద్ద ఆధునిక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని స్థానిక వాకర్స్ ఎమ్మెల్యేను కోరారు. దీంతో ప్రజలకు ఆరోగ్య పరంగా ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్‌కు తక్షణ ఆదేశాలు:
వాకర్స్ సూచించిన సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందిం చారు. అక్కడి నుంచే మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి, బతుకమ్మ కుంట పరిసరాల్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల ఆరో గ్య సంరక్షణకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
బతుకమ్మ కుంట అభివృద్ధికి హామీ:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బతుకమ్మ కుంటను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాకింగ్ స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలి పారు. వాకర్స్ కోరిన ఓపెన్ జిమ్ ఏర్పాటుకు త్వరలోనే చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం:

ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జనగామ అభివృద్ధికి ప్రతి సమస్యపై తక్షణ స్పందన ఉంటుందని స్పష్టం చేశారు.

















