25.8 C
London
Monday, August 10, 2026
Home డెయిలీ అప్​డేట్స్​ ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్ సంఘీభావం

ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్ సంఘీభావం

0
  • ఇందిరాపార్క్‌లో బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో భారీ నిరసన
  • బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి నిరసనలో పాల్గొన్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి 

హైదరాబాద్:

ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన పోరాటానికి సంఘీభావం తెలుపుతూ భారత రాష్ట్ర సమితి పోరుబాట పట్టింది. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు మద్దతుగా బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యం  లో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్(Indira Park in Hyderabad)వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. నిరసనకు ప్రతీక గా నల్ల చొక్కా ధరించి ఆయన నిరసనలో పాల్గొన్నారు. అదే విధంగా ఈ నిరసన కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కేటీఆర్‌ గారితో పాల్గొని విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ..

విద్యార్థుల హక్కులను కాపాడడం ప్రతి ప్రజాస్వామ్య ప్రభు త్వ బాధ్యత అని పల్లా పేర్కొన్నారు. విద్యార్థుల సమస్య లను వెంటనే పరిష్కరించి, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.అనంతరం విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రభు త్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థు ల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి హక్కుల పరిరక్షణ కోసం అవస రమైతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here