హైదరాబాద్:
గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారే అరుణ్ గారి తండ్రి కారే రమేష్‌ను జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి(Mla Palla Rajeswer Reddy) ఆదివారం పరామర్శించారు. ఈ సంద ర్భంగా రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అదే విధంగా అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే వైద్యులను కోరారు.

















